పాపం వ‌రుణ్ సందేశ్ కు శ్రీకృష్ణుడే అడ్డం

updated: February 19, 2018 18:29 IST

లవర్ బోయ్ వరుణ్  తాజాగా ఓ వెచ్ సిరీస్ చేస్తున్నాడు. 'హే కృష్ణ' అనే టైటిల్ తో రూపొందుతున్న  వెబ్ సిరీస్ పాతికేళ్ల ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్ నటిస్తున్నాడు.   'హే కృష్ణ'లో వరుణ్ సందేశ్‌, కాషిష్ ఒహ్రా, 'వివా' హర్ష, మౌనిమ ముఖ్య పాత్ర‌ల్లో నటించారు.ఈ వెబ్ సిరీస్ ను యప్ టీవీలో ప్రసారం చేస్తున్నారు. 'హైదరాబాద్ నవాబ్స్'ఫేం లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించారు. ఆద్యంతం వినోద‌భ‌రితంగా.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేలా ఈ వెబ్ సీరీస్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. ఎపిసోడ్స్ రూపంలో కొనసాగే 'హే కృష్ణ' 12 ఎపిసోడ్స్ వరకు ప్రసారమవుతుంది.   

ఈ వెబ్ సీరిస్ స్టోరీ లైన్ ఏమిటంటే..

 హే కృష్ణ , 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథ. విసుగు పుట్టించే జీవితాన్ని కొనసాగిస్తూ.. ఎప్పుడైనా , ఎవరైనా యువతిని ఆకర్షించాలని ప్రయత్నించినప్పుడల్లా తన ప్రయత్నాల్లో ఘోరంగా విఫలమవుతుంటాడు ఓ యువ‌కుడు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనల తర్వాత  తన బాధలన్నింటికి, తనకు ప్రేమ జీవితం ఏ మాత్రం లేకపోవటానికి కృష్ణ పరమాత్మ  మూల కారణమని భావిస్తాడు. అయితే ఒక గట్టి నిర్ణయం తీసుకోవటంతో అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అదేమిట‌న్న‌ది తెలియాలంటే ఈ వెబ్ సీరీస్ చూడాల్సిందే.

ఈ వెబిసోడ్  చూడడానికి  క్రింద  ఉన్న లింక్ చెయ్యండి 

http://www.yupptv.in/#!/shows/yupptv-originals/hey-krishna

 

comments