సిల్వర్ స్క్రీన్‌పై తొలి సంస్కృత యానిమేటెడ్ చిత్రం, ట్రైలర్ విడుదల

updated: May 24, 2018 20:53 IST
సిల్వర్ స్క్రీన్‌పై తొలి సంస్కృత యానిమేటెడ్ చిత్రం, ట్రైలర్ విడుదల

సంస్కృతం దేవభాష  .. చాలా భాషలకు అది మూలమైనది . అలాంటి సంస్కృత భాషలో వెండితెరను పలకరించినవి ఇప్పటివరకు రెండంటే రెండు చిత్రాలు మాత్రమే. అందులో ఒకటి 'ఆదిశంకరాచార్య' అయితే మరొకటి 'భగవద్గీత'. ఇక సుదీర్ఘకాలం తరువాత,ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇది యానిమేషన్ చిత్రం. అంటే సంస్కృతంలో తెరకెక్కుతున్న తొలి యానిమేషన్ చిత్రం అన్నమాట. ఆ సినిమా పేరు  ‘పుణ్యకోటి’. చాలా కాలం క్రితం క్రౌడ్ ఫండింగ్ మొదలైన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. 

మనందరికీ తెలిసిన ‘ఆవు-పులి’ కథకు సంస్కృతంలో సంభాషణలతో, కథాకథనంతో   ‘ఇన్ఫోసిస్’ చెందిన  వి రవిశంకర్ దర్శకత్వం వహించి నిర్మిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా రవిశంకర్ 40 ఏళ్లు దాటిన వయసులో సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం నేర్చుకొనడం చాలా సులభమే. అది చాలా సులభమైన భాషే. కాని చాలామంది సంస్కృతం చాలా కష్టమైన భాష అని పొరబడుతూ ‘సంస్కృతం’ అంటేనే భయపడి దూరంగాపోతూ ఉంటారు. పిల్లలు చాలామంది జపనీస్, కొరియన్ భాషల్లో పశుజీవన విధాన చిత్రాలు ఉంటే వాటిని కూడా చూస్తారు కదా! అందువల్ల ఇకపై ఈ పశుజీవన విధాన చిత్రాలను సంస్కృతంలో నిర్మించాలని అనుకున్నామని రవిశంకర్ చెప్పారు.

రెండేళ్లపాటు రవిశంకర్ ఈ విషయంలో ఎంతో శ్రమపడ్డారు. ఈ సినిమా విషయంలో తనకు సహకరించగల వారికోసం అన్వేషణ జరిగింది. కేరళ నుంచి, ముంబయి నుంచి, కలకత్తానుండే కాక రుమేనియానుండి బ్రెజిల్ నుండి కూడా తనకు సహకరించే టెక్నీషియన్స్ ని వెతికి పట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో రవిశంకర్‌కు సహకరించేందుకు నటి, సినీ డైరెక్టర్ రేవతి, కన్నడ నటుడు రోగర్ నారాయణన్, కన్నడ విద్యావేత్త నరసింహమూర్తి, సంగీత దర్శకుడు ఇళయరాజా ముందుకొచ్చారు.

 

ఇది సంస్కృత భాషాచిత్రం కాబట్టి అందరికీ సులభంగా భాష అర్థమయ్యలా చేయడానికి బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ లీల సహాయం పొందుతున్నట్టు రవిశంకర్ చెప్పారు. ఇది సంస్కృత చిత్రం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రదర్శించబడుతుందని, ఇది కేవలం బాలలకోసం నిర్మించిన చిత్రంగాకాక అన్ని వయస్సులవారూ ఆసక్తితో చూడగల చిత్రంగా సులభమైన సంభాషణలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందిని రవిశంకర్ వివరించారు.

కథేమిటంటే..

ఒక గ్రామం శివార్లలో ‘పుణ్యకోటి’ అనే పేరుగల ఆవు ‘అద్భుత’ అని పిలువబడే పులి కంటపడింది. చంపడానికి వచ్చిన పులితో ఆవు జాలిగా ‘నా బిడ్డ చాలా ఆకలితో ఉన్నది. దానికి పాలు తాగించి తిరిగి వస్తాను. నన్ను వెళ్లనివ్వు’ అంటుంది. ఆవులోని నిజాయితీ పట్ల పులికి నమ్మకం కలిగింది ‘సరే, వెళ్లిరా!’ అని పంపిస్తుంది. పులికి తనపై కలిగిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆవు తన బిడ్డకు పాలిచ్చి పులివద్దకు తిరిగి వచ్చి ‘ఇప్పుడు నువ్వు నున్న చంపి నీ ఆకలిని తీర్చుకోవచ్చు’ అంటుంది. పులి ఆ ఆవులోని గొప్ప నిజాయితీని చూచి ఆశ్చర్యపోయి దాని ఎదుట తలవంచి వెనక్కి తిరిగి దూరంగా వెళ్లిపోతుంది.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: punyakoti, sanskrit animated movie

comments